News October 16, 2024

సింగిల్ టేక్‌లో 11 నిమిషాల సీన్: వరుణ్ ధవన్

image

వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని 11 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో చేసినట్లు వరుణ్ వెల్లడించారు. ఇది సిరీస్ క్లైమాక్స్‌లో రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.

Similar News

News October 22, 2025

నకిలీ మద్యం కేసు: 7 రోజుల పోలీస్ కస్టడీ!

image

AP: నకిలీ మద్యం కేసు నిందితులను 7 రోజుల పోలీస్ కస్టడీకి VJA కోర్టు అనుమతి ఇచ్చింది. విజయవాడ జైలులో ఉన్న A2 జగన్ మోహన్‌రావును రేపు, నెల్లూరు జైలులో ఉన్న A1 జనార్దన్‌రావును ఎల్లుండి కస్టడీలోకి తీసుకోనున్నారు. A13 తిరుమలశెట్టి శ్రీనివాస్‌నూ కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రేపటికి వాయిదా పడింది. అటు జనార్దన్‌రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.

News October 22, 2025

బిగ్ ట్విస్ట్.. హోల్డ్‌లో నవీన్ యాదవ్ నామినేషన్‌!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్‌పై ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన నామినేషన్‌కు రిటర్నింగ్ అధికారి ఇంకా ఆమోదం తెలపలేదు. ఫామ్-26 తొలి 3 పేజీల కాలమ్స్‌ విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాటిని ఆర్వో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈక్రమంలోనే మళ్లీ పిలుస్తామని, వెయిట్ చేయాలని నవీన్‌కు సూచించారు. దీంతో INC శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News October 22, 2025

రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

రష్మిక-ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్స్‌లో ఆదిత్య సర్పోదర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థామా’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వ్యాంపైర్ థీమ్ కావడంతో ఆడియన్స్‌లో మూవీపై అంచనాలు పెరిగాయి. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.25.11 కోట్లు కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ధమాకా విజయమని నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ పేర్కొంది.