News July 5, 2024

ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లలో 11% వృద్ధి!

image

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నెల రోజుల్లో సెన్సెక్స్, నిఫ్టీ చెరో 11శాతం వృద్ధిచెందాయి. దేశీయ స్టాక్స్‌లో మళ్లీ విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. 2014, 2019లో రిజల్ట్స్ అనంతరం నెల రోజుల్లో నమోదైన వృద్ధితో పోలిస్తే ఈసారి మెరుగ్గా ఉంది. 2014లో సెన్సెక్స్ 4.43% వృద్ధి నమోదు కాగా, 2019లో అది 1%కు పరిమితమైంది. కాగా 2009లో సెన్సెక్స్ 22% వృద్ధి నమోదు కావడం గమనార్హం.

Similar News

News March 31, 2026

రీల్స్ చేస్తూ బాలిక మృతి

image

AP: తిరుపతిలో దారుణ ఘటన జరిగింది. అలిపిరి PS పరిధిలో ఉన్న రాజారెడ్డినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ కూతురు (13) రీల్స్ చేస్తూ ఐదో అంతస్తు నుంచి పడి మృతిచెందింది. నేపాల్‌కు చెందిన ఈ ఫ్యామిలీ స్థానికంగా నివాసం ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం బాధాకరం. సరదా కోసం చేసే పనులు ఇలా ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది.

News March 31, 2026

స్పామ్ కాల్స్‌ను అడ్డుకోండిలా!

image

స్పామ్ కాల్స్‌, SMSలతో విసిగిపోయారా? వాటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ DND యాప్‌ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో మీ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుంటే ఇలాంటి కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు. ఏయే ప్రమోషనల్ మెసేజ్‌లు రావాలో ఎంచుకోవచ్చు. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేసి, ట్రాక్ చేయొచ్చు. 2025లో ఇలాంటి 1,84,482 స్పామ్ కాల్స్‌ను ట్రాయ్ తొలగించింది. ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

News March 31, 2026

మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 ఎగబాకి రూ.1,36,850 పలుకుతోంది. ఇక వెండి ధర కేజీపై రూ.5వేలు తగ్గి రూ.2,50,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుంటాయి