News November 30, 2025

1100 సేవలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

ప్రకాశం జిల్లా ప్రజలు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. గ్రీవెన్స్ డేలో అర్జీలు అందించినప్పటికీ పరిష్కారం కాకపోయినా, తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు 1100ను సంప్రదించాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో PGRS రద్దయిన విషయం తెలిసిందే.

Similar News

News March 7, 2026

3000 మందితో మహిళా దినోత్సవ వేడుకలు: JC

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులు ఆదేశించారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 3000 మందితో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్నామన్నారు. దానికి అనుగుణంగా మెప్మా, ఐసీడీఎస్ శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు.

News March 6, 2026

కొత్తపట్నంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని SI తెలిపారు.

News March 6, 2026

మార్కాపురం జిల్లా వైద్యశాలలో వేధిస్తున్న డాక్టర్ల కొరత

image

మార్కాపురం జిల్లా వైద్యశాలలో డాక్టర్లు, వైద్య పరికరాలు, సరైన యంత్రాలు లేక పేషెంట్లకు వైద్యం అందడం లేదు. ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాలలో పేషెంట్లను ఎమర్జెన్సీ వైద్య సదుపాయం కోసం జిల్లా వైద్యశాలకు డాక్టర్లు రిఫర్ చేస్తారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో ఒంగోలు రిమ్స్‌కు రిఫర్ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా జిల్లా వైద్యశాలలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించాలని పేషెంట్లు కోరుతున్నారు.