News August 31, 2025
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సెప్టెంబర్ 1 ఉదయం 10 గంటల నుంచి స్పెషల్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు వారి అర్జీలను కలెక్టరేట్‌లో అందించే అవసరం లేకుండా https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.
Similar News
News September 3, 2025
అనకాపల్లి జిల్లాలో 28 పంచాయతీలకు కొత్త భవనాలు: ఈఈ

అనకాపల్లి జిల్లాలో 28 పంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించనున్నట్లు పీఆర్ ఈఈ ఎన్.శివ ప్రసాద్ తెలిపారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.8.96 కోట్లు మంజు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పలువురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా వాటికి పరిపాలన పరమైన ఆమోదం లభించిందని అన్నారు. ఒక్కొక్క భవనానికి రూ.32 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
News September 3, 2025
అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్: రింకూ సింగ్

భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని రింకూ సింగ్ వెల్లడించారు. ‘అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో రాణించగలననే నమ్మకం ఉంది. టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావాలనుకోవట్లేదు. నేను సిక్సులు కొడితే ఫ్యాన్స్ ఇష్టపడతారని తెలుసు. కానీ రంజీల్లో కూడా నా సగటు (55) బాగుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
News September 3, 2025
మహబూబాబాద్ జిల్లాలో తగ్గిన వర్షపాతం

గత కొన్ని రోజుల నుంచి MHBD జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 8:30 గం. వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల 4.8మి.మీ, బయ్యారం 1.4, నెల్లికుదురు 3.0, మరిపెడ 3.8, దంతాలపల్లి 2.6, తొర్రూర్ 1.6, పెద్ద వంగర 1.2, మొత్తంగా 18.4 మి.మీ.గా నమోదైంది.