News November 24, 2024
111 కోట్ల జీరో టికెట్లు జారీ: మంత్రి పొన్నం
TG: తమ ప్రభుత్వం ఆర్టీసీలో తీసుకొచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా మహిళలు రూ.3,747 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఈ నెల 20 వరకు 111 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. పథకం అమలు తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి చేరిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక TGSRTC ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2024
వాయుగుండం.. మూడు రోజులు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
News November 24, 2024
త్వరలో భారత్కు బ్రిటన్ ‘కింగ్’
బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణి క్వీన్ కెమెల్లాతో కలిసి త్వరలో భారత్కు రానున్నారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో 2022లో ఆయన ఇండియా టూర్ రద్దయింది. ఇప్పుడు INDతో పాటు పాక్, బంగ్లాలోనూ ఆయన పర్యటిస్తారు. ఈ ఏడాది క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ కోలుకున్న ఆయన OCTలో ఆస్ట్రేలియా నుంచి బ్రిటన్కు తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఓ వెల్సెస్ సెంటర్కి వెళ్లారు. ఇప్పుడు మరోసారి అక్కడికి వెళ్లే ఛాన్సుంది.
News November 24, 2024
కాంగ్రెస్ ‘మహా’ పతనం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైంది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా, 1995లో 80, 1999లో 75, 2004లో 69, 2009లో 82, 2014లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది. తాజాగా 20 సీట్లలోపే రావడం కాంగ్రెస్కు రాష్ట్ర ప్రజల్లో ఆదరణ తగ్గడాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.