News April 5, 2024

రైల్వేలో 1113 అప్రెంటిస్ పోస్టులు

image

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు విభాగాల్లోని 1113 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల ప్రకారం టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 15 నుంచి 24 ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. అభ్యర్థులు మే 1వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ కోసం ఈ <>లింక్‌<<>>పై క్లిక్ చేయండి. వెబ్‌సైట్: https://apprenticeshipindia.org

Similar News

News January 6, 2025

BREAKING: మరో రెండు hMPV కేసులు

image

దేశంలో మరో రెండు hMPV కేసులు వెలుగుచూశాయి. చెన్నైలో ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది.

News January 6, 2025

హీరో విశాల్ ఆరోగ్యంపై అపోలో డాక్టర్ల అప్డేట్

image

<<15074772>>హీరో విశాల్<<>> ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ‘ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స అందిస్తున్నాం. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఓ లెటర్ రిలీజ్ చేశారు. కాగా ‘మదగజరాజ’ ఈవెంట్‌లో విశాల్ వణుకుతూ, సరిగ్గా నడవలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

News January 6, 2025

కుంభమేళాపై దాడి చేస్తాం: గురుపత్వంత్ పన్నూ

image

Jan 13 నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌లో ప్రారంభ‌మయ్యే కుంభ‌మేళాపై దాడి చేస్తామ‌ని ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది గురుప‌త్వంత్ సింగ్ పన్నూ హెచ్చ‌రించాడు. హిందూత్వ సిద్ధాంతాల్ని అంతం చేయ‌డానికి త‌ర‌లిరావాలంటూ మ‌ద్ద‌తుదారుల‌కు పిలుపునిచ్చాడు. ల‌క్నో, ప్ర‌యాగ్‌రాజ్ విమానాశ్ర‌యాల్లో ఖ‌లిస్థానీ, క‌శ్మీర్ జెండాల‌ను ఎగ‌రేయాల‌ని, కుంభ‌మేళా-2025 యుద్ధ‌భూమిగా మారుతుంద‌ని చెప్పుకొచ్చాడు. పన్నూ గతంలోనూ ఇలాంటి హెచ్చరికలు చేశాడు.