News January 4, 2025
1,123 ఎకరాల్లో తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్..!
ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలో ఓ ఎయిర్పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప.గో జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. దాదాపు 1,123 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.
Similar News
News January 8, 2025
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు: నరసాపురం ఆర్డీవో
లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నరసాపురం ఆర్డీవో దాసిరాజు హెచ్చరించారు. నరసాపురం ఆర్డీవో కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు (పీసీ, పీఎన్డీటీ) కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్స్‌పై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది డివిజన్లోని స్కానింగ్ సెంటర్స్‌లో నిత్యం తనిఖీలు నిర్వహించాలన్నారు.
News January 8, 2025
ప.గో: కోడి పందేల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంక్రాంతికి నిర్వహించే కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న పందేలను పూర్తిగా ఆపేయకుండా, కత్తులు కట్టకుండా నిర్వహిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్
News January 8, 2025
ప.గో. జిల్లాలో నేడు మోదీ ప్రారంభించేవి ఇవే..!
ప.గో. జిల్లాలోని వివిధ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ నుంచి నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. జీలుగుమిల్లి- బుట్టాయిగూడెం, ఎల్ఎన్డీ పేట- పట్టిసీమ రహదారి విస్తరణ (రూ.369 కోట్లు), గుడివాడ- భీమవరం- నరసాపురం రైల్వే లైన్, భీమవరం- నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు (రూ.4612 కోట్లు) ప్రారంభిస్తారు.