News January 4, 2025
1,123 ఎకరాల్లో తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్..!

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలో ఓ ఎయిర్‌పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప.గో జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. దాదాపు 1,123 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.
Similar News
News July 4, 2025
తణుకులో అత్యధిక వర్షపాతం నమోదు

గడచిన 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 34.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా తణుకు మండలంలో 12.2, ఆచంట 5.2, పెంటపాడు 4.2, పోడూరు 3.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం, వీరవాసరం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.
News May 7, 2025
జిల్లాలో ప్రస్తుతానికి ఎవరూ లేరు: ఎస్పీ

పశ్చిమగోదావరి జిల్లాలో పాకిస్థానీలు ప్రస్తుతానికి ఎవరూ లేరని జిల్లా అద్నాన్ నయీమ్ అస్మి శనివారం తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశాలతో పాస్పోర్ట్, వీసాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు తనిఖీల్లో ప్రజల సహకరించాలని కలెక్టర్ నయీమ్ అస్మి విజ్ఞప్తి చేశారు.
News May 7, 2025
యథావిధిగా పీజిఆర్ఎస్: ప.గో కలెక్టర్

ప. గో. జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (PGRS) మీకోసం సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అలాగే “1100 మీకోసం కాల్ సెంటర్” ద్వారా ఫిర్యాదులను నమోదు చేయుట, నమోదు అయిన ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవచ్చన్నారు. అన్ని మండల స్థాయి డివిజన్ స్థాయిలో యథావిధిగా పీజిఆర్ఎస్ జరుగుతుందన్నారు.