News November 27, 2024
9 నెలల్లో రూ.11,333 కోట్ల సైబర్ మోసం

ఈ ఏడాది తొలి 9నెలల్లో భారత్ రూ.11,333కోట్ల సైబర్ మోసానికి గురైనట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో రూ.4,636 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్‌తో రూ.3,216 కోట్లు, డిజిటల్ అరెస్ట్ మోసాల వల్ల రూ.1,616కోట్లు నష్టపోయినట్లు వివరించింది. 2021నుంచి మొత్తం 30.05లక్షల సైబర్ క్రైం ఫిర్యాదులు వచ్చాయంది. ఇందులో 45 శాతం మోసాలు కంబోడియా, మయన్మార్, లావోస్ కేంద్రంగా జరుగుతున్నట్లు గుర్తించారు.
Similar News
News November 25, 2025
ALERT.. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

AP: మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంది.
News November 25, 2025
జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

తెలంగాణలో జనవరి 2026లో కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటుపై ఈ మధ్యాహ్నం క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇప్పటికే రూ.59,671 కోట్ల నష్టాల్లోని TGSPDCL, TGNPDCLలపై సబ్సిడీ సరఫరా భారం తగ్గనుంది. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, పేదలకు 200 యూనిట్లు ఫ్రీ, మిషన్ భగీరథ & HYD వాటర్ బోర్డు కొత్త డిస్కంలో ఉంటాయి. దీంతో పాటు మరిన్ని విద్యుత్ సంస్కరణలు నేటి భేటీలో చర్చకు వస్తాయని సమాచారం.
News November 25, 2025
భారత్‌కు తొలి మహిళా వరల్డ్ స్నూకర్ టైటిల్

చెన్నైకి చెందిన 23 ఏళ్ల అనుపమ రామచంద్రన్ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌గా అవతరించారు. చెన్నైలోని విద్యా మందిర్ స్కూల్‌లో చదివిన అనుపమ, ప్రస్తుతం ఎంఓపీ వైష్ణవ్ కాలేజీలో పబ్లిక్ పాలసీలో పీజీ చేస్తున్నారు. జూనియర్ స్థాయిలో 8 జాతీయ టైటిళ్లు, అమీ కమానీతో కలిసి 2023లో ఉమెన్స్ స్నూకర్ వరల్డ్ కప్, అండర్-21 ప్రపంచ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నారు. మహిళల విభాగంలో భారత్‌కు ఇదే మొట్టమొదటి ప్రపంచ స్నూకర్ టైటిల్.


