News October 16, 2025

SECLలో 1,138 పోస్టులు

image

సౌత్ ఈస్ట్రర్న్ కోల్‌ఫీల్డ్స్ (SECL) 1138 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అసిస్టెంట్ ఫోర్‌మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్(595 ) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్‌మెన్ పోస్టులకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులకు నేటి నుంచి NOV 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Similar News

News October 16, 2025

‘మిత్ర మండలి’ రివ్యూ&రేటింగ్

image

తండ్రి కులాంతర పెళ్లికి ఒప్పుకోడని హీరోయిన్ (నిహారిక) ఇంటి నుంచి పారిపోవడం, దీంతో ఆమె ఫ్రెండ్స్ పడిన ఇబ్బందులే స్టోరీ. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణుల కామెడీ అక్కడక్కడా మినహా చాలాచోట్ల రుద్దినట్లు అనిపిస్తుంది. సత్య యాక్టింగ్ రిలీఫ్ ఇస్తుంది. బ్రహ్మానందం ఓ పాటలో మెరిశారు. నవ్వించాలనే సెటప్ చేసుకున్నా డైరెక్టర్ విజయేందర్ సక్సెస్ కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, సాంగ్స్, BGM తేలిపోయాయి.
రేటింగ్: 1.75/5.

News October 16, 2025

లవకుశుల్లో ఎవరు పెద్దవారు?

image

లవకుశులు కవలలన్న విషయం మనకు తెలిసిందే. ఈ జంట పదాల్లో లవుడి పేరు ముందుండటం వల్ల లవుడు పెద్దవాడని అనుకుంటారు. కానీ అనేక పురాణాలు కుశుడు పెద్దవాడని చెబుతున్నాయి. కవలల్లో ముందు జన్మించిన వారిని పెద్దవారిగా పరిగణిస్తారు. రామాయణ గాథలు కుశుడే ముందు జన్మించినట్లు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి కుశుడు పెద్దవాడని చెప్పవచ్చు. అయితే కుశుడిని, వాల్మీకీ తన మాయా శక్తితో సృష్టించాడన్న కథనాలు కూడా ఉన్నాయి.

News October 16, 2025

పంచదారతో పసిడి చర్మం

image

అందంగా కనిపించాలని కోరుకోని వారుండరు. అలాగని రోజూ ఖరీదైన క్రీములు వాడి చర్మ సంరక్షణ చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారు ఇంట్లోనే సులువుగా దొరికే పంచదారతో చిటికెలో మెరిసిపోవచ్చు. * గులాబీ రేకుల్ని ముద్దగా చేసి, దానికి చెంచా చొప్పున తేనె, పంచదార కలిపి ముఖానికి పూత వేయండి. అలా ఓ నలభై నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే ముఖం కాంతులీనుతుంది.