News January 15, 2026
114 రాఫెల్స్.. రూ.3.25 లక్షల కోట్ల డీల్!

భారత రక్షణ రంగంలోనే అతిపెద్ద ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.3.25 లక్షల కోట్ల డీల్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. ఈ వారాంతంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒప్పందంలో భాగంగా 30% స్వదేశీ పార్ట్స్‌తోనే ఇండియాలోనే తయారీకి ప్రణాళికలు రూపొందించారు. ఈ డీల్ ఫిక్స్ అయితే భారత్‌లో రాఫెల్స్ సంఖ్య 176కు పెరగనుంది.
Similar News
News February 14, 2026
అప్పుల్లో AP నం.1.. మళ్లీ ₹500కోట్ల రుణమా: YCP

AP: అప్పుల్లో రాష్ట్రం నంబర్ 1గా ఉందని YCP ట్వీట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చే మంగళవారం ₹500 కోట్లు అప్పు చేయనుందని, ఈ మేరకు RBI శుక్రవారం నోటిఫై చేసిందని పేర్కొంది. ఈనెల 3న చంద్రబాబు సర్కారు ₹3,300 కోట్లు అప్పు చేసిందని, ఇప్పటికే రాష్ట్రంపై ₹3లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని మోపారని తెలిపింది. రుణ భారం పెరగడం తప్ప ప్రజల జీవన ప్రమాణాలు మారడం లేదని విమర్శించింది.
News February 14, 2026
మున్సి’పోల్స్’లో కాంగ్రెస్ విజయం.. రాహుల్ ఏమన్నారంటే?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ విజయం కార్యకర్తలు, తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ఈ ఫలితాలు ప్రజాకర్షక విధానాలు, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధికి నిదర్శనం అని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
News February 14, 2026
282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CSC ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో TGలో 10, APలో 7 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cscspv.in


