News October 12, 2025

1,149 పోస్టులు.. దరఖాస్తు చేసుకోండి

image

ఈస్ట్ సెంట్రల్ రైల్వే RRC 1,149 అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు 15నుంచి 24ఏళ్లు గల అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. SC, ST, PwBD, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: www.ecr.indianrailways.gov.in

Similar News

News October 12, 2025

రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షం

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. APలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు TGలో భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని పేర్కొంటూ HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 12, 2025

3వ రోజు ముగిసిన ఆట.. పోరాడుతున్న వెస్టిండీస్

image

INDvsWI రెండో టెస్టులో తొలి 2 రోజులు టీమ్‌ఇండియా డామినెన్స్ కనిపించింది. కాగా మూడో రోజు ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ పోరాడుతోంది. 35కే 2 వికెట్లు పడిపోయినా బ్యాటర్లు హోప్(66), క్యాంప్‌బెల్(87) క్రీజులో పాతుకుపోయారు. మరో వికెట్ పడకుండా 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ జట్టు ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు.

News October 12, 2025

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

image

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోనున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. అట్లీ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న AA22 కోసం ఆయన ఏకంగా రూ.175 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభాస్ కొన్ని సినిమాలకు రూ.150 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నాయి. దీంతో రాబోయే సినిమాలతో ఐకాన్ స్టార్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.