News February 23, 2026

116 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>SBI <<>>116 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్(AVP, డిప్యూటీ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc/BE/BTech, BCA/MCA, M.Tech, MSc, CA, ICAI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

Similar News

News March 2, 2026

ఇరాన్‌లో ఎంత మంది చనిపోయారంటే..

image

మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధం మారణహోమమే సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 555 మంది మరణించినట్లు ఆ దేశంలోని రెడ్ క్రెసెంట్ సంస్థ ప్రకటించింది. మొత్తం 131 నివాసాలను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. గాయపడిన వారి వివరాలను మాత్రం చెప్పలేదు. శనివారం ప్రకటించిన సమాచారం ప్రకారం.. 201 మంది చనిపోగా, 747 మంది గాయపడ్డారు.

News March 2, 2026

నెతన్యాహు ఆఫీసుపై దాడి చేశాం: IRGC

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ IRGC టార్గెట్ చేసింది. తాము నెతన్యాహు ఆఫీసుపై క్షిపణులతో దాడి చేశామని ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కార్యాలయంపైనా అటాక్ చేశామని పేర్కొంది. నెతన్యాహు ఎక్కడ ఉన్నారు? ఆయన పరిస్థితి ఏంటనే దానిపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. అటు తమ దేశంపైకి దూసుకొస్తున్న UAVలను నేలకూలుస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

News March 2, 2026

J&K: ఖమేనీ మద్దతుదారులపైకి టియర్ గ్యాస్

image

అయతుల్లా ఖమేనీ హతానికి నిరసనగా జమ్మూకశ్మీర్లో షియా ముస్లిములు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ జెండాలతో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇలా చేసినట్టు సమాచారం. ఉదయం నుంచి శ్రీనగర్లో షియాలు బంద్ పాటిస్తూ నిరసన చేపట్టడం తెలిసిందే. దీంతో అల్లర్లు జరగకుండా దేశవ్యాప్తంగా ఐబీ అలర్టైంది. రాష్ట్రాలకూ సూచనలు జారీ చేసింది.