News March 28, 2025
టెన్త్ అర్హతతో 1,161 ఉద్యోగాలు.. మరో వారమే?

సీఐఎస్ఎఫ్ 1,161 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కానిస్టేబుల్/డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్, డ్రైవర్ ఫర్ సర్వీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెట్రిక్యులేషన్తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. https://cisfrectt.cisf.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు.
Similar News
News November 27, 2025
ఆవు పేడతో అలుకుత ఎందుకు చల్లాలి?

పూజలు, శుభకార్యాల సమయంలో ఆవు పేడతో అలుకుత చల్లే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆవు పేడ ఒక అద్భుతమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. కీటకాలను దూరం చేసే సహజ సిద్ధమైన పరిష్కారంగా దీన్ని భావిస్తారు. అప్పట్లో రసాయన క్రిమిసంహారకాలు ఉండేవి కాదు. అందుకే ఆ రోజుల్లో నేలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి, సానుకూల శక్తిని నింపడానికి ఈ పద్ధతిని ఆచరించేవారు.
News November 27, 2025
నేటి నుంచి వైకుంఠద్వార దర్శనాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్

AP: ఇవాళ 10AM నుంచి వైకుంఠద్వార దర్శనం టోకెన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. మొదటి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. DEC 1 వరకు TTD వెబ్సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ WhatsApp సర్వీసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. DEC 2న ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు టోకెన్ వివరాలు మెసేజ్ ద్వారా అందుతాయని చెప్పారు.
News November 27, 2025
వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. లాక్ డౌన్

వాషింగ్టన్(US)లోని వైట్ హౌస్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. దుండగుల కాల్పుల్లో ఇద్దరు జాతీయ భద్రతాదళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్ను లాక్ డౌన్ చేశారు. ఘటన జరిగినప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. దేశ రాజధానిలో నేరాల కట్టడికి ట్రంప్ వాషింగ్టన్ అంతటా వేలాది మంది సైనికులను మోహరించిన తరుణంలో కాల్పులు జరగడం గమనార్హం.


