News August 12, 2024

117 జీవోను రద్దు చేస్తాం: ఎమ్మెల్సీ

image

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 22 ఉపాధ్యాయ సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. 117 జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వీలైనంత తొందరలో వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

Similar News

News July 8, 2025

గిరి ప్రదక్షిణ భక్తులకు హెల్ప్ లైన్ నంబర్లు

image

జూలై 9న జరగబోయే గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం జీవీఎంసీ హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం తెలిపారు. 32 కి.మీలు ప్రదక్షిణలో జీవీఎంసీ తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని, భక్తులకు సమస్యలు ఎదురైతే జీవీఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 0891-2507225, టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009లకు కాల్ చేయాలన్నారు.

News July 8, 2025

సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు

image

సాగరతీర విహారానికి డబుల్ డెక్కర్ బస్సులు సిద్ధంగా వున్నాయి. RK బీచ్ నుంచి భీమిలి వరకు సైట్ సీయింగ్ కోసం పర్యాటక శాఖ ఈ బస్సులను త్వరలోనే ప్రవేశ పెట్టనుంది. బీచ్ అందాలను డబుల్ డెక్కర్ నుంచి వీక్షించడానికి వైజాగ్ వాసులు ఎదురు చూస్తున్నారు. పర్యాటకంగా విశాఖకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.

News July 7, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

కోటబొమ్మాలి రైల్వే లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తే డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. విశాఖ -గుణుపూర్ (58505/06), విశాఖ -బరంపూర్ (58531/32), విశాఖ -భువనేశ్వర్ ఇంటర్ సిటీ (22819/20), విశాఖ- పలాస ప్యాసింజర్ (67289/90), విశాఖ -బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/26) రైళ్ళు జూలై 11న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.