News December 11, 2024
రియాలిటీ షో కోసం రూ.118 కోట్లు ఖర్చు!

యూట్యూబ్‌లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన మిస్టర్ బీస్ట్ కొత్త రియాలిటీ షో నిర్వహించనున్నారు. అమెజాన్‌తో కలిసి ఆయన ‘బీస్ట్ గేమ్స్’ పేరుతో కొత్త రియాలిటీ షో కోసం సెట్ నిర్మించేందుకు $14 మిలియన్స్ (రూ.118 కోట్లు) వెచ్చించినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ఈ సిరీస్‌లో 10 ఎపిసోడ్స్ ఉంటాయని, విజేతకు 5 మిలియన్ డాలర్లు అందించనున్నట్లు సమాచారం. రియాలిటీ షోల చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీగా నిలవనుంది.
Similar News
News February 3, 2026
ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం

భారత్‌పై ప్రతీకార టారిఫ్‌లను 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ శాంతి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున అమెరికా అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ప్రపంచశాంతికి ట్రంప్ నాయకత్వం కీలకమని xలో ట్వీట్ చేశారు.
News February 3, 2026
భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతం: ట్రంప్

భారత్‌పై టారిఫ్‌ల తగ్గింపునకు ప్రతిఫలంగా.. అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ముందుకొస్తుందని ట్రంప్ తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. సుమారు 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇంధన, వ్యవసాయ, బొగ్గు, సాంకేతిక ఉత్పత్తుల కొనుగొలుకు మోదీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. దీని వల్ల భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆయన ఆకాంక్షించారు.
News February 3, 2026
రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.


