News January 1, 2025
హైదరాబాద్‌లో 1184 డ్రంక్&డ్రైవ్ కేసులు

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్‌లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 15, 2026
నెతన్యాహును వేటాడి మరీ చంపేస్తాం: IRGC

నెతన్యాహు మరణించలేదంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఒకవేళ ఆయన బతికే ఉంటే వేటాడి మరీ చంపేస్తామని IRGC హెచ్చరించింది. మరోవైపు నెతన్యాహు చేతికి ఆరువేళ్లు ఉన్నాయని.. అది <<19382555>>AI వీడియో<<>> అని ఇరాన్ వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది AI వీడియో కాదని, లైటింగ్ వల్ల ఆప్టికల్ ఇల్యూజన్ ఏర్పడి అలా ఒక వేలు ఎక్స్‌ట్రా ఉన్నట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.
News March 15, 2026
బెండలో బూడిద, పల్లాకు తెగులు నివారణ

☛ బూడిద తెగులు వల్ల ఆకులు పచ్చబడి రాలిపోతాయి. నివారణకు లీటర్ నీటిలో 3 గ్రా. కరిగే గంధకపు పొడి లేదా 1mlడైనోకాప్ (లేదా) 2mlహెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలి. ☛ బెండలో పల్లాకు తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగులోకి మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. పల్లాకు తెగులు నివారణకు లీటర్ నీటిలో 2.5 గ్రా. క్లోరోథలానిల్ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలి.
News March 15, 2026
చిన్నచిన్న ధర్మాలతో పాపాలెలా పోతాయి?

జనకుడితో వశిష్ఠ మహర్షి ఇలా వివరించారు.. ‘అడవిలో ఎండుగడ్డి వాము ఎంత పెద్దదైనా చిన్న నిప్పు రవ్వ దాన్ని క్షణంలో బూడిద చేస్తుంది. అలాగే యుగయుగాల పాపలు ధర్మాలనే చిన్న పుణ్య కార్యాల ముందు నిలవలేదు. భక్తితో చేసే నదీ స్నానం, దీపారాధన పాపాలను దహించివేస్తాయి. ‘నారాయణ’ అనే నామానికి ఉన్న శక్తి అపారమైనది. ఆ నామ ఉచ్ఛారణతో యమభటులే వణికిపోతారు. భగవంతుని కృపకు ఆడంబరమైన యజ్ఞాల కంటే ధర్మం మిన్న అని గ్రహించు’.


