News April 6, 2025
IDBIలో 119 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లోని పలు విభాగాల్లో 119 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ చేసిన వారు అర్హులు. SC/STలు రూ.250, మిగతా వారు రూ.1,050 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <
Similar News
News April 8, 2025
సింగపూర్ వెళ్తున్నా: పవన్

తాను ఈ రాత్రి 9.30 గం.కు సింగపూర్ వెళ్లబోతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయనతో పాటు చిరంజీవి దంపతులూ అక్కడికి వెళ్లనున్నారు. ‘నేను అరకులో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది. నా కొడుకు పక్కనే కూర్చున్న పాపకు తీవ్రగాయాలయ్యాయి. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మిగతా అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు. కాగా ఈ ప్రమాద సమయంలో ఆ భవంతిలో 30 మంది పిల్లలు ఉండగా, ఓ చిన్నారి మరణించింది.
News April 8, 2025
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్‌లో భాగంగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
CSK: రుతురాజ్(C), కాన్వే, రచిన్, విజయ్, జడేజా, ధోని, అశ్విన్, నూర్, ముకేశ్, ఖలీల్, పతిరణ.
PBKS: ఆర్య, ప్రభ్‌సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్(C), స్టొయినిస్, వధేరా, మ్యాక్స్‌వెల్, శశాంక్, జాన్సెన్, అర్ష్‌దీప్, ఫెర్గూసన్, చాహల్.
News April 8, 2025
త్వరలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్

వాట్సాప్ ప్లాట్‌ఫామ్ త్వరలోనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో చాటింగ్, షేర్ చేసిన వీడియోస్, ఫోటోలు రిసీవర్ సేవ్ చేసుకునే అవకాశం లేకుండా కొత్త ఫీచర్ డెవలప్ చేస్తుంది. దీంతో మన వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అయితే స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్‌షాట్‌ల ద్వారా సేవ్ చేసే విషయంపై స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం IOSయూజర్స్ కోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు.