News April 10, 2024

12న ఈవీఎంల రాండమైజేషన్: కలెక్టర్

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ సిబ్బందితో శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాండమైజేషన్ ప్రక్రియపై ఆయన వారికి అవగాహన కల్పించారు.

Similar News

News December 18, 2025

రాజానగరం: రేపు నన్నయకు రానున్న నారా లోకేశ్

image

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాలను శుక్రవారం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారని వీసీ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. గురువారం జేసీ వై. మేఘా స్వరూప్‌తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఇంజినీరింగ్, ఎగ్జామినేషన్స్, స్కూల్ ఆఫ్ కామర్స్ భవనాలను మంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇదే వేదికపై రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వీసీ తెలిపారు.

News December 18, 2025

తూ.గో జిల్లాకు నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..!

image

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 19వ తేదీన తూ.గో జిల్లాలో పర్యటించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 8.45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని 5.45కి విజయవాడకు బయలుదేరుతారన్నారు. ఆయన పర్యటనకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

News December 18, 2025

రాజమండ్రి: బాలికపై బాలుడి అత్యాచారం.. కేసు

image

మైనర్ బాలికపై రాందాసు పేటకు చెందిన పెద్దగింజపై అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. సెంట్రల్ జైలు వద్ద ఉన్న పార్కులో ఓ బాలుడు బాలికతో మాటలు కలిపి అక్కడి నుంచి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు పలు దొంగతనం కేసుల్లో నేరస్థుడుగా ఉన్నట్లు సమాచారం.