News September 13, 2024

12న కనుపర్తిపాడులో జాబ్ మేళా

image

ఎన్నికల హామీల్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో గురువారం ఆమె మాట్లాడుతూ .. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాలులో ఈనెల 14న శనివారం జాబ్ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. పలు సంస్థల ప్రతినిధులు వస్తారని.. నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.

Similar News

News December 13, 2025

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

image

హ్యాండ్లూమ్, టైలరింగ్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్‌కు సంబంధించిన పరీక్షలను జనవరిలో నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా ఆయా విభాగాలకు సంబంధించిన నిర్దేశించిన ఫీజులను ఆన్లైన్ ద్వారా చెల్లించాలని కోరారు.

News December 13, 2025

తిరుపతి చేరిన నెల్లూరు రాజకీయం.?

image

నెల్లూరు మేయర్ స్రవంతి అవిశ్వాస తీర్మాన ఘట్టం పొలిటికల్ హీట్ పెంచింది. 18న ఎలాగైనా అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాలని మంత్రి నారాయణ, MLA కోటంరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే దాదాపు 37 మంది కార్పొరేటర్లు TDPకి మద్దతు పలుకుతుండగా వారిని తిరుపతికి తరలించినట్లు సమాచారం. జగన్ సమక్షంలో చేరిన ఐదుగురు కార్పొరేటర్లలలో మరో ఇద్దరు TDP చెంతకు వచ్చారు. అవిశ్వాసం నెగ్గాలంటే 38 సభ్యులు కావాలి.

News December 13, 2025

నెల్లూరు: ఏడాదిపాటు లేడీ డాన్ అరుణకు నో ఛాన్స్.!

image

లేడీ డాన్ నిడిగుంట అరుణ బయటికి వస్తే మళ్లీ నేరాల బాట పట్టే అవకాశం ఉందని, అందుకే పీడీ యాక్ట్ నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ యాక్ట్ ద్వారా ఆమెకు ఏడాది పాటు బెయిల్ రాదని.. ఎవరినీ కలిసే అవకాశం ఉండదన్నారు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.