News April 10, 2024

12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ

image

ఈ నెల 12న గుంటూరు నగరంలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12న సీఎం జగన్ యాత్ర సత్తెనపల్లి, పేరేచర్ల, నల్లపాడు మీదుగా గుంటూరులోని ఏటుకూరు సెంటర్‌కు చేరుకుంటుదన్నారు. అక్కడ సభలో జగన్ ప్రసంగిస్తారని చెప్పారు.

Similar News

News January 7, 2026

GNT: BSNL యూజర్లకు శుభవార్త

image

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GBడేటా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News January 7, 2026

అమరావతిలో తొలి భూ సేకరణ నేటి నుంచే..!

image

అమరావతిలో తొలిసారి భూసేకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి పూలింగ్‌కు ఇవ్వని సుమారు 4.5 ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బుధవారం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫిబ్రవరి చివరి నుంచి స్టీల్ బ్రిడ్జీ అందుబాటులోకి రానుండటంతో ప్రజలకు కనెక్టివిటీ అందించేందుకు భూ సేకరణ చేపడుతున్నామని మంత్రి నారాయణ ఇప్పటికే తెలిపారు.

News January 7, 2026

నేడు గుంటూరులో మంత్రి అచ్చెన్నాయుడు ప‌ర్య‌ట‌న‌

image

రాష్ట్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. చుట్టుగుంట‌లోని వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, క‌మీష‌న్ ఏజెంట్స్, అధికారుల‌తో మంత్రి స‌మావేశం అవుతారు. రాబోవు మిర్చి సీజ‌న్‌లో మిర్చి యార్డ్‌లో రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా, మిర్చి ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వ్వకుండా అనుస‌రించాల్సిన విధివిధానాల‌పై మంత్రి చ‌ర్చించ‌నున్నారు.