News October 9, 2024
12న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)కు విజయదశమి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ శనివారం ఓపీ, ఓటీ సేవలు అందుబాటులో ఉండవు. స్విమ్స్ అత్యవసర విభాగం(క్యాజువాలిటీ) సేవలు యథాతథంగా కొనసాగుతాయని వీసీ ఆర్.వి.కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 23, 2025
పుంగనూరు: అనపకాయలకు భలే డిమాండ్

చిత్తూరు జిల్లాలో ఈ సీజన్లో అనపకాయలు విరివిగా లభిస్తాయి. పలువురు రైతులు వీటిని ప్రధాన పంటగా, అంతర్ పంటగా భూముల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం రైతులు కిలో రూ.50 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి ఇవి ఎగుమతి అవుతున్నాయి. అనప గింజలు, పితికి పప్పు కూరను పలువురు ఇష్టంగా తింటారు. అలాగే వీటిని నూనెలో వేయించి స్నాక్స్గా కూడా వాడుతారు.
News December 23, 2025
నగరిలో టీడీపీ నేత అక్రమాలు: YCP

నగరి ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత భారీగా రేషన్ అక్రమ రవాణా చేశారని వైసీపీ ఆరోపించింది. నిండ్రలోని నెట్టేరి వద్ద తనిఖీల్లో 4 టన్నుల రేషన్ బియ్యంతో టీడీపీ ఎస్సీ సెల్ నేత అల్లిముత్తు పట్టుబడినట్లు తెలిపింది. తర్జనభర్జనల తర్వాత అల్లిముత్తు , కార్తీక్ , విక్రమ్పై పోలీసులు కేసు నమోదు చేశారని, సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించింది.
News December 23, 2025
చిత్తూరు: మూడేళ్ల నుంచి 257 మంది మృతి

బైక్ ప్రమాదాలలో మృత్యువాతను తప్పించేలా చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకపోవడంతో 2023లో 84 మంది, 2024లో 90, ఈ సంవత్సరం ఇప్పటివరకు 83 మంది ప్రమాదాలలో మృతి చెందారు. వీటిని అరికట్టేందుకు అధికారులు గత కొద్ది రోజులుగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నారు.


