News January 23, 2025

12వ రోజు 286 మంది అభ్యర్థుల ఎంపిక

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 12వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 286 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.

Similar News

News February 10, 2025

మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి!

image

కర్నూలు జిల్లా పరిధిలోని గీత కులాలకు సంబంధించి 10 మద్యం షాపులకు మొత్తం 133 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దరఖాస్తులను జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారుల పరిశీలన అనంతరం సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నవ్య లాటరీ పద్ధతిలో కేటాయించారు. 10 షాపులు దక్కించుకున్న వారి పేర్లను ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

News February 10, 2025

కర్నూలు జిల్లా న్యూస్ రౌండప్

image

☞ నేడు కర్నూలులో ప్రజా పరిష్కార వేదిక
☞ గీత కులాల మద్యం షాపులకు నేడు లాటరీ
☞ 6,42,391 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
☞ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 659 మందిపై కేసులు
☞ రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన 23ఏళ్ల యువకుడి మృతి
☞ శ్రీరంగాపురంలో నేడు ఆరాధన
☞ చెట్నిహళ్లిలో మళ్లీ వివాదం.. అంత్యక్రియల అడ్డగింత
☞ నేడు శ్రీశైలానికి ఐదుగురు మంత్రుల బృందం

News February 10, 2025

కర్నూలు జిల్లాలో 6,42,391 మందికి ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ

image

కర్నూలు జిల్లాలో ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధమైంది. నేడు జాతీయ నులి పరుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 6,42,391 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, విద్యాశాఖ సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం మింగించేలా ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో డా.శాంతికళ తెలిపారు.

error: Content is protected !!