News June 26, 2024
12వ స్థానంలో పార్వతీపురం.. విజయనగరం@18

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 72.27 శాతం ఉత్తీర్ణతతో 12వ స్థానంలో నిలిచింది. 440 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 318 మంది పాసయ్యారు. విజయనగరం జిల్లాలో 2,748 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,711 మంది ఉత్తీర్ణత సాధించారు. 62.26 శాతం పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.
Similar News
News November 12, 2025
VZM: నేడు PMAY గృహ ప్రవేశాలు

విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 8,793 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం జరగనుందని హౌసింగ్ పీడీ మురళీ తెలిపారు. బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయనున్నారు. రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా గృహప్రవేశాలు జరుగనున్నాయి.
News November 12, 2025
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి తప్పనిసరి: DSP

శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 30 పోలీసు చట్టంను నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11వరకు అమలు చేస్తున్నట్లు విజయనగరం ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు మంగళవారం తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించి, పోలీసుశాఖ అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
News November 12, 2025
రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం: మంత్రి

విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే CII 30వ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి మేలు చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 30 మంది విదేశీ మంత్రులు పాల్గొననున్నారని చెప్పారు. మొత్తం 410 ఒప్పందాల ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.


