News December 24, 2024
12 నెలలకు వేతనాలు ఇప్పించాలని కోదండరాంకు విజ్ఞప్తి

ప్రభుత్వ పాఠశాలల్లో SSA ఆధ్వర్యంలో పని చేస్తున్న సిద్దిపేట జిల్లా ఒకేషనల్ సంఘం నేతలు MLC కోదండరాంను కలిశారు. తమకు 12 నెలలకు గాను వేతనం ఇప్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోదండరాం.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో VTA రాష్ట్ర నాయకులు ప్రవీణ్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, నవీన్, జ్ఞానేశ్వర్, వృత్తి విద్య అధ్యాపకులు పాల్గొన్నారు.
Similar News
News December 17, 2025
MDK: ఎన్నికల్లో ముగ్గురు బాల్య మిత్రులు గెలుపు

తూప్రాన్ మండలం ఘనాపూర్ జీపీలో బాల్యమిత్రులు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఎస్ఎస్సీ బాల్య మిత్రులైన సురేష్, వేణు, సయ్యద్ అన్వర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. వేణు, సురేష్లకు వార్డులలో సభ్యులుగా పోటీ చేయడానికి రిజర్వేషన్ అనుకూలించింది. అన్వర్కు అనుకూలించకపోవడంతో తల్లి నజ్మా బేగంను ఎన్నికలలో నిలిపారు. సురేష్, వేణు, నజ్మా బేగం, (అన్వర్ తల్లి) వార్డు సభ్యులుగా గెలిచారు.
News December 17, 2025
మెదక్: రుణదాతల వేధింపులతో వ్యక్తి సూసైడ్

అప్పు ఇచ్చినవారు వేధించడంతో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణంలోని కువత్ ఇస్లాంకు చెందిన మహమ్మద్ షాదుల్లా హుస్సేన్ (45) పట్టణంలో పోస్ట్ ఆఫీస్ సమీపంలో టీ స్టాల్ నడుపుతూ జీవిస్తున్నాడు. రూ.30 లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు వేధించడంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫాతిమా టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 17, 2025
MDK: గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

చిన్నశంకరంపేట మండలం జంగరాయి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గుండెపోటుతో అస్పత్రిలో చేరిన సంజీవరెడ్డి మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు అస్పత్రిలో చేరారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


