News June 25, 2024
12 పర్యాటక సర్క్యూట్లో అమ్రాబాద్‌కు అవకాశం
అచ్చంపేట: పకృతి పర్యాటక అభివృద్ధిపై పర్యాటక శాఖ దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 12 పర్యాటక సర్క్యూట్లు గుర్తించింది. దీంట్లో నల్లమల్ల ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను గుర్తించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన కొండలు, జలపాతాలు , జల వనరులు ప్రాంతాలను గుర్తించి విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖ, దేవాదాయ శాఖ, నీటిపారుదల శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నారు.
Similar News
News January 14, 2025
మల్లికార్జున స్వామికి కైలాస వాహన సేవ
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో మంగళవారం మకర సంక్రాంతి పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు, పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.
News January 14, 2025
MBNR: జూ.కళాశాలల్లో సమస్యలు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బదిలీలు, ఇతర కారణాలతో మొత్తం 14 కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కళాశాలలు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి. వీరు వారి కళాశాలతో పాటుగా అదనపు బాధ్యతలు అప్పగించిన కళాశాలలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పదోన్నతుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.
News January 14, 2025
MBNR: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్‌కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.