News December 30, 2025
‘12 గ్రేప్స్ థియరీ’.. ఈ సెంటిమెంట్ గురించి తెలుసా?

కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోరుకుంటూ పాటించే సెంటిమెంట్లలో ‘12 గ్రేప్స్ థియరీ’ ఒకటి. స్పెయిన్ సంప్రదాయం ప్రకారం డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు నిమిషానికి ఒకటి చొప్పున 12 ద్రాక్ష పండ్లను తినాలి. ఒక్కో పండు ఏడాదిలోని ఒక్కో నెలకు సంకేతం. ఇలా తింటూ బలంగా సంకల్పించుకుంటే ఆ ఏడాదంతా అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది నమ్ముతుంటారు. న్యూఇయర్ వేళ SMలో ఈ మేనిఫెస్టేషన్ ట్రెండ్ వైరలవుతోంది.
Similar News
News January 10, 2026
APMSRB: 97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 97 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యసేవల నియామక బోర్డు(APMSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో క్లినికల్, నాన్-క్లినికల్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు ఈ నెల 12వ తేదీ నుంచి 27వ తేదీ రాత్రి 11.59గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ <
News January 10, 2026
రైతులకు రూ.2,000.. ఫిబ్రవరిలోనే!

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000లను 3 విడతలుగా కేంద్రం జమ చేస్తోంది. ఇప్పటివరకు 21 విడతలు పూర్తయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 22వ విడత నిధులు ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి E-కేవైసీ, ఆధార్, బ్యాంక్ వివరాలు తప్పనిసరి చేశారు. లోపాలు ఉంటే బెనిఫిషరీ లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉండటంతో రైతులు వివరాలను సరిచూసుకోవాలి.
News January 10, 2026
ఈ పథకం కింద ఏ పరికరాలను అందిస్తారు?

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, యాంత్రీకరణను ప్రోత్సహించి అధిక దిగుబడులను సాధించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను ప్రభుత్వం రాయితీగా అందించనుంది. దీని వల్ల పంట నాట్లు, కోత సమయంలో కూలీల కొరత, ఖర్చు తగ్గి రైతులకు ఎంతో లబ్ధి కలగనుంది.


