News November 13, 2025

12 నెలల వేతనాల చెల్లింపునకు నిధులు విడుదల

image

AP: రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్ల వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసింది. ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్‌కు నెలకు రూ.5వేల చొప్పున 2024 ఏప్రిల్-జూన్, 2025 జనవరి-సెప్టెంబర్ నెలలకు గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రి ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీల సంక్షేమం, సాధికారతకు కట్టుబడి ఉందని తెలిపారు.

Similar News

News November 13, 2025

బీపీఎస్ గడువు పొడిగింపు!

image

AP: అనుమతులు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2025 ఆగస్టు 31లోపు కట్టిన ఇళ్లు, భవనాలను బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్)లో క్రమబద్ధీకరించుకునేలా అవకాశమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. 4 నెలల్లోగా అప్లై చేసుకోవాలని తెలపింది. ఈ పథకం ద్వారా 59,041 అనధికార నిర్మాణాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
వెబ్ సైట్: <>www.bps.ap.gov.in<<>>

News November 13, 2025

MCEMEలో 49 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

మిలటరీ కాలేజీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్(MCEME)49 గ్రూప్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/PET&PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 8

image

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామ లఖన సీతా మన బసియా ||
భావం: రాముడి చరిత్రను వినడానికి ఆసక్తి చూపిన వారి మనసులో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నివాసం ఉంటారు.
సుగుణాల రాముడి కథలను వినడం, పఠించడం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది. ఫలితంగా ఆ దేవదేవుడు మన హృదయ మందిరంలో స్థిరంగా నిలుస్తాడు. నిత్యం దైవ స్మరణలో ఉంటే జీవితం ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఉంటుందని ఈ శ్లోకం బోధిస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>