News July 5, 2024
14 రోజుల్లో కూలిన 12 బ్రిడ్జిలు.. 11 మంది సస్పెండ్

బిహార్లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేస్తూ కొత్తవాటి నిర్మాణానికి వారే నిధులు సమకూర్చాలని పేర్కొంది. కాగా బిహార్లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయి.
Similar News
News November 23, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.
News November 23, 2025
దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభమా?

దీపంలో వత్తి పూర్తిగా కాలిపోవడం ఎలాంటి అశుభానికి సంకేతం కాదని పండితులు చెబుతున్నారు. వత్తి పూర్తిగా కాలిపోవడం, దీపం మధ్యలోనే ఆగిపోవడం అనేవి భౌతిక కారణాల వల్ల మాత్రమే జరుగుతుందని అంటున్నారు. ‘వీటికి దైవిక దోషాలు, ఎలాంటి అశుభ కారణాలు లేవు. దీపం ఎప్పుడూ సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. కాబట్టి ఈ పరిణామాల వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. భయపడవలసిన అవసరం లేదు’ అని వివరిస్తున్నారు.
News November 23, 2025
57 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఏనుగు

MPలోని పన్నా టైగర్ రిజర్వులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 57 ఏళ్ల అనార్కలి అనే ఏనుగు కవలలకు జన్మనివ్వడంతో అడవి సిబ్బంది, వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏనుగు ఒక్క పిల్లకే జన్మనిస్తుంది. కానీ పన్నా చరిత్రలో తొలిసారిగా 3 గంటల వ్యవధిలో 2 పిల్లలు పుట్టాయి. దీంతో ఈ టైగర్ రిజర్వులో ఏనుగుల సంఖ్య 21కు చేరింది. గత 39 ఏళ్లలో పన్నాలో ఈ ఏనుగు ఇప్పటివరకు ఆరు సార్లు ప్రసవించింది.


