News April 6, 2024
కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు?

TG: ఇవాళ తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌లో 12మంది BRS MLAలు చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గంగుల కమలాకర్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కోవా లక్ష్మి, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మాణిక్ రావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగుంట గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని BRS శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది సాయంత్రం తేలిపోనుంది.
Similar News
News November 25, 2025
అమరావతికి మహార్దశ.!

అమరావతిలో రాజధాని అభివృద్ధి నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌కు నిరాశ మిగలనుంది. ప్రధాన రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడ స్టేషన్‌లో రద్దీ దృష్ట్యా 10 ప్లాట్‌ఫామ్స్‌కి అదనంగా 2 నిర్మించాలని రైల్వే శాఖ భావించింది. అయితే ఇప్పుడు ఈ అభివృద్ధి అమరావతిలో కొత్త టెర్మినల్ నేపథ్యంలో ప్లాట్ ఫామ్ విస్తరణను అధికారులు నిలిపివేశారు. వీటికి అయ్యే ఖర్చును రైల్వే శాఖ అమరావతి, గన్నవరం స్టేషన్లపై పెట్టనుంది.
News November 25, 2025
సుబ్రహ్మణ్య స్వామిని పూజించే విధానం ఇదే..

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయాన్నే తల స్నానం చేయాలి. తడి బట్టలతో కార్తికేయుడి ఆలయానికి వెళ్లి పూజ చేయాలి. మురుగన్‌కు పండ్లు, పువ్వులు సమర్పించడం శ్రేయస్కరం. బ్రహ్మచారిగా ఉన్న స్కందుడిని పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. పండుగ నాడు బ్రహ్మచారులకు భోజనం పెట్టి, వస్త్రాలు సమర్పించి గౌరవిస్తారు. కావడి మెుక్కులు తీర్చుకునే ఆచారం కూడా ఉంది. ఫలితంగా పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.
News November 25, 2025
చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. వయా తిరుపతి

APలోని తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపేలా ద.మ. రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసి తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. చెన్నై నుంచి HYD వరకు 778km ప్రాజెక్టులో తొలుత గూడూరు మీదుగా రైలు నడపాలని ద.మ. రైల్వే భావించింది. తిరుపతి నుంచి అమలు చేయాలన్న TN విజ్ఞప్తితో కొన్ని సవరణలు చేసింది. దీనికి ఆ ప్రభుత్వం అంగీకరిస్తే చెన్నై-తిరుపతి-HYD బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.


