News October 22, 2024
12 మంది హెడ్ మాస్టర్ల సస్పెండ్

TG: రాష్ట్రంలో 12 మంది హెడ్ మాస్టర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్ఫర్స్లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. మహబూబ్ నగర్(D)లో 10 మంది, వనపర్తి, జనగామ(D)ల్లో ఒక్కో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News November 22, 2025
బీస్ట్ మోడ్లో సమంత

ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న నటి సమంత సడన్గా బీస్ట్ మోడ్లోకి వెళ్లారు. తాజాగా తన ఫిట్నెస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆమె తన బ్యాక్, ఆర్మ్స్ మజిల్స్ను ఫ్లెక్స్ చేస్తూ తన అథ్లెటిక్ బాడీని చూపించారు. ఒకప్పుడు ఇలాంటి బాడీ తనకు సాధ్యం కాదని అనుకున్నానని, కానీ ఇప్పుడు సాధించానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె ఫిట్నెస్కి అభిమానులు ఫిదా అవుతున్నారు.
News November 22, 2025
యాపిల్ కంటే చిన్న పసికందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ముంబైలో 350 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి 124 రోజుల పాటు NICUలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ కావడం అద్భుతంగా నిలిచింది. జూన్ 30న ప్రీమెచ్యూర్గా (25 వారాల గర్భధారణ) జన్మించిన ఈ బిడ్డ యాపిల్ కంటే చిన్నగా ఉండేది. పుట్టిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఇటీవల డిశ్చార్జ్ అయింది. బిడ్డ బరువు 1.8 కిలోలకు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు బతికిన అత్యంత తక్కువ బరువున్న శిశువుగా నిలిచింది. (PC: TOI)
News November 22, 2025
ONGCలో 2,623 పోస్టులు.. అప్లై చేశారా?

ఆయిల్ & నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)లో 2,623 అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి NOV 25 ఆఖరు తేదీ. ఈ నెల 17వరకు NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-24 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వెబ్సైట్: ongcindia.com/


