News December 17, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 62,112 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు, 2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నారు.
Similar News
News December 13, 2025
టమాటాలో బొడ్డు కుళ్లు/ పూత వైపు కుళ్లు నివారణకు సూచనలు

టమాటా అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడి, మొక్కల్లో కాల్షియం లోపం వల్ల బొడ్డు కుళ్లు కనిపిస్తుంది. నత్రజని, నేలలో కరిగే పోటాషియం, మెగ్నిషియం ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు నేలలో తేమ హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. భూమిలో తగినంత కాల్షియం ఉండేట్లు చూసుకోవాలి. పైరు కోత దశలో కాల్షియం నైట్రేట్ 7.5-10 గ్రాములు లేదా కాల్షియం క్లోరైడ్ 4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
కోల్కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో HYDలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రౌండ్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అటు సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు టెంట్లు, ఫ్లెక్సీలు, కుర్చీలను <<18551215>>ధ్వంసం చేశారు<<>>. పోలీసులు వారిని చెదరగొట్టారు.
News December 13, 2025
తిరుమలలో పరకామణి మీకు తెలుసా?

తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే మొక్కుబడులు, కానుకలను లెక్కించే ప్రదేశమే ‘పరకామణి’. పూర్వం ఇది శ్రీవారి ఆలయం లోపల, ఆనంద నిలయం వెనుక ఉండేది. ప్రస్తుతం భద్రత, సాంకేతిక పరిజ్ఞానంతో, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ఎదురుగా పరకామణి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలాది మంది భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల కానుకల లెక్కింపు నిరంతరం జరుగుతూ ఉంటుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>


