News January 3, 2025

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం స్వామిని 62,085మంది దర్శించుకోగా 15,681 మంది తలనీలాల సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.17కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. జ‌న‌వ‌రి 10-19 వ‌ర‌కు శ్రీవారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్లడించింది.

Similar News

News January 5, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: మంత్రి లోకేశ్

image

AP: ప్రధాని మోదీ విశాఖ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. 8న నగరంలో కి.మీ మేర PM రోడ్ షో ఉంటుందని పర్యటనపై సమీక్ష తర్వాత మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని మరోసారి తేల్చి చెప్పారు. రుషికొండ ప్యాలెస్ తప్ప, ఉత్తరాంధ్రకు వైసీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. లులు, IT కంపెనీలను తరిమేసిందని విమర్శించారు. దేశంలో భారీగా పెన్షన్ ఇస్తోంది ఏపీనే అని లోకేశ్ చెప్పారు.

News January 5, 2025

మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే: వెంకయ్యనాయుడు

image

TG: ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు నిలిచిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. HICCలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో ఆయన ప్రసంగించారు. ‘వేష, భాషల పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. కోపంలోనూ ఎదుటివారి మంచిని కోరుకోవడం మన సంప్రదాయం. మీ పిల్లలు చల్లగుండ.. మీ ఇల్లు బంగారంగాను అని తిట్టుకునేవారు. మాతృభాషను మర్చిపోతే మాతృబంధం విడిచిపోయినట్లే’ అని పేర్కొన్నారు.

News January 5, 2025

కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

image

TGలో కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 26 నుంచి జారీ చేయనుంది. ఇందుకోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించే ఛాన్సుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. అర్హతల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, గత విధానాలనే యథాతథంగా కొనసాగించే ఛాన్సుంది. గ్రామసభలు, బస్తీ సభల్లో దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే వచ్చిన 12 లక్షల దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంది.