News January 27, 2025
20 రోజుల్లో 12 ఘటనలు.. మహిళలకు రక్షణేది?: YCP

AP: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని YCP ఆరోపించింది. ‘రాష్ట్రంలో నిత్యం మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇదే విషయమై Dy.CM పవన్ హోంమంత్రిపై వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. అయినా అత్యాచారాలు, హత్యలు తగ్గడం లేదు. వీటివెనక కొంతమంది TDPనేతలు, వారి కుమారులున్నారు’ అని ట్వీట్ చేసింది. 20రోజుల్లో 12ఘటనలు జరిగాయని పేర్కొంది.
Similar News
News December 4, 2025
ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<
News December 4, 2025
పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
News December 4, 2025
‘అఖండ-2’ రిలీజ్ ఆపాలి: మద్రాస్ హైకోర్టు

‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ-2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్(ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2’ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.


