News September 27, 2024
12 కి.మీ ఛేజింగ్.. ఒకరి కాల్చివేత.. ₹60 లక్షలు స్వాధీనం

కేరళలోని త్రిసూర్లో 3 ATMలను లూటీ చేసి ₹60 లక్షలతో ఉడాయిస్తున్న హరియాణా ముఠాను తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఒక ట్రక్కులో TNలోకి ప్రవేశించిన ఈ ఏడుగురు సభ్యుల మూఠాను నమక్కల్ పోలీసులు 12KM ఛేజింగ్ చేశారు. వారు పోలీసులపై దాడి చేసి ఇద్దర్ని గాయపర్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముఠా సభ్యుడొకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ట్రక్కు, అందులోని కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News December 5, 2025
ప్రయాణికులకు చుక్కలు.. మరో 600 విమానాల రద్దు

ప్రయాణికులకు IndiGo చుక్కలు చూపిస్తోంది. ఇవాళ మరో 600 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీలో 235, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో 100 చొప్పున ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే/వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీటికి అవస్థలు పడుతున్నామని, రాత్రి నేలపై పడుకున్నామని వాపోతున్నారు.
News December 5, 2025
ఇవి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయ్..

మన ఆహార వ్యవస్థలకు పునాది భూమి. అయితే ప్లాస్టిక్ వినియోగం, అడవుల నరికివేత, రసాయన పరిశ్రమల వ్యర్థాలు, మిరిమీరిన పురుగు మందులు, రసాయన ఎరువుల వినియోగం, లోతు దుక్కులు, తీర ప్రాంతాల్లో సముద్రమట్టం పెరుగుదల, వరదలు, గాలి, తుఫానులతో నేల కోతకు గురవ్వడం వల్ల భూసారం దెబ్బతిని, పంట దిగుబడి, ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వీటి కట్టడికి మన వంతు ప్రయత్నం చేసి నేల సారం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
News December 5, 2025
హోమ్ లోన్ EMIపై ఎంత తగ్గుతుందంటే?

RBI రెపో రేటును తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ తగ్గింపుతో బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తాయంటున్నారు. ఫలితంగా గృహ, వాహన రుణాలపై నెలవారీ ఈఎంఐలు తగ్గి రుణగ్రహీతలకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్న వారికి నెలకు దాదాపు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు భారం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.


