News January 21, 2025
కుంభమేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాలు!

ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో 12లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ NLB సర్వీసెస్ అంచనా వేసింది. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే సుమారు 4.5లక్షల మందికి ఉపాధి లభించవచ్చని తెలిపింది. హోటల్ స్టాఫ్, టూర్ గైడ్, పోర్టర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ కోఆర్డినేటర్లు, రవాణా, వైద్య శిబిరాల్లో లక్షల మందికి పని దొరికిందని చెప్పింది.
Similar News
News September 16, 2025
16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధం

డ్రగ్ ట్రాఫికింగ్ కేసుల్లో పట్టుబడిన 16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. వారిని స్వదేశాలకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల వారీగా డ్రగ్ ట్రాఫికర్స్ జాబితా సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపినట్లు వెల్లడించాయి.
News September 16, 2025
యువరాజ్, ఉతప్ప, సోనూసూద్లకు ED సమన్లు

భారత మాజీ క్రికెటర్లు యువరాజ్, ఉతప్ప, బాలీవుడ్ నటుడు సోనూసూద్లకు ED సమన్లు జారీ చేసింది. ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్(1xBet)కు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు రైనా, ధవన్, మాజీ నటి మిమీ చక్రవర్తిలను ED విచారించింది. కాగా 1xBet యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న నటి ఊర్వశీ రౌతేలాకు గతంలోనే సమన్లు జారీ చేసింది.
News September 16, 2025
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.