News August 28, 2024
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు 12వేల దరఖాస్తులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటితో గడువు ముగిసింది. కొద్దిసేపు వెబ్సైట్ మొరాయించినా రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసే సరికి 12వేల మంది అప్లై చేసుకున్నారు. వీటిని వెరిఫై చేసిన తర్వాత రేపు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
Similar News
News November 26, 2025
సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలు.. మన గ్రామానికి ఎప్పుడంటే..

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో, రెండో విడత మోతె, చివ్వెంల, పెన్ పహాడ్. చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో జరగనున్నాయి. HNR నియోజకవర్గంలోని గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.
News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.
News November 26, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

ఆసిఫాబాద్ జిల్లాలోని 335 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో వాంకిడి, జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్ యూలోని 114 జీపీలకు, 2వ విడతలో బెజ్జూర్, చింతలమనే పల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్పేట, సిర్పూర్ టీలోని 113 జీపీలకు, 3వ దశలో కాగజ్ నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన,
తిర్యాణి మండలాల్లోని 108 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.


