News March 19, 2025

ఫ్రిజ్‌లో 12 టన్నుల మేక మాంసం..!

image

హైదరాబాద్‌లోని మంగళ్‌హట్‌లో రూ.8 లక్షలు విలువ చేసే 12 టన్నుల మేక మాంసాన్ని GHMC టాస్క్ ఫోర్స్ సిబ్బంది సీజ్ చేశారు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు గొర్రెలు, మేకల మాంసాన్ని కొని ప్రిజ్‌లో భద్రపరుస్తున్నట్లు గుర్తించారు. ఇలా నిల్వచేసిన మాంసాన్ని హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఈ ఘటనతో రెస్టారెంట్లలో తినే ముందు ఆలోచించాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News March 20, 2025

రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా సోమనాథ్‌

image

AP: రాష్ట్ర స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. పరిశ్రమలు, పరిశోధనలు, స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీపై సలహాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అడ్వైజర్‌గా కేపీసీ గాంధీని నియమిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.

News March 20, 2025

పడుకునే ముందు ఈ తప్పు చేస్తున్నారా?

image

ప్రతి ఒక్కరూ సాధారణంగా పడుకునే ముందు పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని నిద్రిస్తారు. అయితే తలపైన నీళ్లను పెట్టుకోకూడదని, ఇది అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రతికూలత వ్యాపించి మానసిక స్థితి దెబ్బతింటుందని పేర్కొంటున్నాయి. అలాగే నెగటివ్ ఎనర్జీ వ్యాపించి ఒత్తిడి, ఆందోళన వంటివి పెరుగుతాయట. రాత్రి పూట గొంతెండిపోయే సమస్య ఉన్నవారు కాళ్ల వైపు వాటర్ బాటిల్ పెట్టుకోవడం ఉత్తమం.

News March 19, 2025

SRH జెర్సీలో మహ్మద్ షమీ.. పిక్ వైరల్

image

ఐపీఎల్ 2025 కోసం మహ్మద్ షమీ సన్నద్ధమవుతున్నారు. SRH జెర్సీ ధరించి ఆయన ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో షమీని SRH రూ.10 కోట్లకు దక్కించుకుంది. జట్టు పేస్ దళాన్ని షమీ నడిపించనున్నారు.

error: Content is protected !!