News March 22, 2024

12 మంది వాలంటీర్ల తొలగింపు: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని ఎన్నికల అధికారి, కలెక్టర్ సృజన తెలిపారు. కోడ్ వచ్చినప్పటి నుంచి 20వ తేదీ వరకు పబ్లిక్ ప్రాపర్టీస్ మీద ఉన్న 15,115, ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఉన్న 5,649 గోడ రాతలు, పోస్టర్లు, బ్యానర్లు, తదితరాలను తొలగించామన్నారు. కోడ్ ఉల్లంఘించిన 12మంది వాలంటీర్లను ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News November 17, 2024

నల్లమల అడవుల్లో పెరిగిన పులుల సంతతి

image

నంద్యాల జిల్లాలోని నల్లమల అడవుల్లో పులుల సంతతి పెరిగినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పదేళ్ల క్రితం 34 పెద్ద పులులు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 87 చేరినట్లు వెల్లడించారు. పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అడవుల్లోకి ఎవరినీ రానివ్వకుండా చేయడంతో పాటు పలు నిబంధనలు పెట్టి, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

News November 17, 2024

అపార్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డీఈఓ

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అపార్ నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని కర్నూలు డీఈవో శ్యామ్యూల్ పాల్ అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిర్దేశించిన గడువులోగా జిల్లాలో అపార్ నమోదు 85%కి చేరుకునేలా సంబంధిత డిప్యూటీ డీఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 17, 2024

నా భర్తను చిత్రహింసలకు గురి చేశారు: వర్రా కల్యాణి

image

ఈనెల 8న క‌ర్నూలు టోల్‌ప్లాజా వ‌ద్ద తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని, 12న మేజిస్ట్రేట్ ముందు హాజ‌రు పరిచినట్లు YCP నేత వర్రా రవీంద్రా రెడ్డి భార్య వర్రా కల్యాణి తెలిపారు. శనివారం కడపలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ 3 రోజులు తన భ‌ర్త‌ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి, త‌ప్పుడు స్టేట్‌మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. రవీంద్రా రెడ్డిని ఈనెల 11న అదుపులోకి తీసుకున్నార‌న్న‌ది అవాస్త‌వం అని పేర్కొన్నారు.