News November 3, 2024
4.2 ఓవర్లలోనే 120 రన్స్.. భారత్‌పై ఒమన్ గెలుపు

హాంకాంగ్ సిక్సెస్ లీగ్‌లో భారత జట్టు మరో ఘోర పరాజయం చవిచూసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 119/3 స్కోర్ చేసింది. ఉతప్ప 13 బంతుల్లో 52 కొట్టారు. కాగా ఛేదనకు దిగిన ఒమన్ జట్టు 4.2 ఓవర్లలోనే 120/0 చేసి గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ వినాయక్ శుక్లా 11 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 రన్స్ చేశారు. భారత్ నిన్న UAE చేతిలోనూ ఓడటం గమనార్హం.
Similar News
News January 8, 2026
విజయ్ మూవీ వాయిదా.. టికెట్ మనీ రిఫండ్

తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించకపోవడంతో BMS టికెట్లు కొన్నవారికి రిఫండ్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడైన 4.5లక్షల టికెట్ల అమౌంట్‌ను తిరిగిచ్చేస్తోంది. దీంతోపాటు ప్రమోషన్లు, థియేటర్ల అగ్రిమెంట్ల రూపంలో మేకర్స్‌కు రూ.50కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉందని సమాచారం.
News January 8, 2026
భారత మాజీ కోచ్‌లపై కన్నేసిన శ్రీలంక

T20 WCలో రాణించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు పలు కీలక నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ను అపాయింట్ చేసుకున్న ఆ జట్టు, తాజాగా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌నూ తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. JAN 18 నుంచి MAR 10 వరకు ఆయన SL జట్టుకు కోచ్‌గా ఉండనున్నారు. ఫిబ్రవరి 7న WC ప్రారంభం కానుంది. కాగా IPLలో RR టీమ్‌కు విక్రమ్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నారు.
News January 8, 2026
ఇమ్యునిటీని పెంచే బ్రేక్ ఫాస్ట్

అల్పాహారంలో హెల్తీ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి గుడ్లు, చిలగడదుంప, ఓట్స్ అంటున్నారు నిపుణులు. ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్, ఫైబర్, బీటా-గ్లూకాన్ ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి, జింక్, సెలీనియం, విటమిన్ ఈ, చిలగడ దుంపలో కాల్షియం, మెగ్నీషియం, థయామిన్, జింక్, విటమిన్లు ,మినరల్స్ ఉంటాయి.


