News September 11, 2024

12,18 తేదీల్లో PHD అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

image

MGU నిర్వహించిన PHD పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఆకుల రవి మంగళవారం తెలిపారు. ఈనెల 12న బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, 18న కామర్స్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని, ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు, నెట్, సెట్ ఇతర అర్హత పత్రాలను తీసుకురావాలన్నారు. మిగిలిన సబ్జెక్టుల వారికి త్వరలో ప్రకటిస్తామన్నారు.

Similar News

News October 13, 2024

NLG: పత్తి రైతుకు దక్కని మద్దతు ధర

image

నల్గొండ జిల్లాలో పత్తి పంట పండిస్తున్న రైతులు దళారుల చేతిలో దగా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస ధర కూడా లభించకపోవడంతో దళారుల ఊబిలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం మద్దతు ధర క్వింటాకు రూ.7,521 ఉండగా వ్యాపారులు రూ.6300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి రైతుల చేతికి వచ్చినా ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని తెలిపారు.

News October 12, 2024

NLG: గోపాలమిత్రలు సేవలు భేష్

image

గోపాలమిత్రలు ఆపదలో ఉన్న పశుపోషకులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం సరిగా లేదు. కనీసం రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేని గ్రామాలకు సైతం వీరు వెళ్లి పశువులకు పశువైద్యం అందిస్తున్నారు. పండగ వేళల్లో సైతం తమ సేవలను అందజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి రెగ్యులర్ చేయాలని గోపాలమిత్రల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ కోరారు.

News October 12, 2024

హుజూర్‌నగర్: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామ రోడ్డుపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హుజుర్‌నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన తోకల మహేశ్ స్వగ్రామానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడు. దీంతో దసరా పండగ వేళ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.