News March 20, 2025

125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Similar News

News December 1, 2025

ములుగు: పంతాలు, పట్టింపులు లేవు.. అన్నీ పంపకాలే..!?

image

ఉప్పు నిప్పులా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీలు పల్లెపోరులో పంతం వదులుతున్నాయి. నిన్నటి దాకా ఎదురుపడితే బుసలు కొట్టుకున్న నాయకులు సంధి రాజకీయాలు చేస్తున్నారు. సర్పంచ్, వార్డులను మీకిన్ని.. మాకిన్ని.. అంటూ పంచుకుంటున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన పంచాయతీల్లో ఈ పంపకాలు జోరందుకున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా నేతలు ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణ లోపు కొలిక్కి తెచ్చేలా మంతనాలు సాగిస్తున్నారు.

News December 1, 2025

జగిత్యాల: బుజ్జగింపులు.. బేరసారాలు

image

జగిత్యాల జిల్లాలో తొలి విడతలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసి నేటి నుంచి 3 రోజులు విత్‌డ్రాకు గడువు ఉండడంతో అభ్యర్థులు బుజ్జగింపులు, బేరసారాలకు దిగుతున్నారు. తనకు మద్దతుగా విత్ డ్రా చేసుకోవాలని పలువురు అభ్యర్థులు తనకు పోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తూ బేరసారాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.

News December 1, 2025

నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

image

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.