News March 20, 2025

125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 20, 2025

BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

image

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు, కురుమార్తి ఆలయ అభివృద్ధికి రూ.110 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు కేటాయించగా పాలమూరు ప్రాజెక్టుకు నిరాశే మిగిలింది. బడ్జెట్‌పై మిత్రమ స్పందన వస్తోంది.

News March 20, 2025

విజయనగరం జిల్లా వాసులకు అలెర్ట్

image

విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 °C టెంపరేచర్‌ నమోదు కానుండగా.. 20 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వంగరలో 40.6°C, తెర్లాంలో 40.5°C, రామభద్రపుర, రేగిడి ఆమదాల వలసలో 40.2, మెరకముడిదాంలో 40, గజపతినగరం, రాజాంలో 39.9, గంట్యాడలో 39.7, సంతకవిటిలో 39.6, గరవిడిలో 39.5, గుర్లలో 39.3, విజయనగరంలో 38.5°C గా నమోదవుతాయి.

News March 20, 2025

ఇవాళ్టి AP న్యూస్ రౌండప్

image

* నేటితో ముగియనున్న MLA, MLCల క్రీడాపోటీలు
* అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు ఈ-లాటరీ
* విశాఖలో నిరసనలకు వైసీపీ పిలుపు
* అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగింపు
* వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై తుది విచారణ
* తిరుపతి తొక్కిసలాట ఘటన.. CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్

error: Content is protected !!