News December 19, 2025

125 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

కోల్ ఇండియా లిమిటెడ్(<>CIL<<>>) 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 26 నుంచి జనవరి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.coalindia.in/

Similar News

News December 21, 2025

కొత్త చీపురును ఎప్పుడు కొంటే ఉత్తమం?

image

చీపురును గౌరవించాలని మన శాస్త్రాలు చెబుతాయి. తద్వారా ఇంట్లో సంపద, సుఖశాంతులు పెరుగుతాయని నమ్మకం. కొత్త చీపురును మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో కొంటే మంచిదని పండితుల వాక్కు. దీపావళి, ధన త్రయోదశి సమయాల్లో కొంటే మరింత శుభకరమని అంటున్నారు. చీపురును దక్షిణ/పడమర దిశలో, ఇతరులకు కనిపించని చోట పడుకోబెట్టి ఉంచాలని సూచిస్తున్నారు. తలకిందులుగా ఉంచితే అవమానించినట్లట. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు.

News December 21, 2025

మళ్లీ ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ ఆసీస్ వశం

image

ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగుతోంది. మూడో టెస్టులోనూ ఆసీస్ 82 పరుగుల తేడాతో విజయం సాధించి మరో 2 టెస్టులు మిగిలి ఉండగానే యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో క్రాలీ(85), జేమీ స్మిత్(60), విల్ జాక్స్(47), కార్స్(39), రూట్(39) పరుగులు చేశారు.
స్కోర్లు: ఆసీస్ 371/10, 349/10; ఇంగ్లండ్ 286/10, 352/10

News December 21, 2025

శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

image

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.