News June 27, 2024

మేఘాకు రూ.12,800 కోట్ల కాంట్రాక్ట్

image

హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) భారీ కాంట్రాక్టును దక్కించుకుని, అణు ఇంధన రంగంలోకి అడుగుపెట్టింది. కర్ణాటకలోని కైగా వద్ద 700 మెగావాట్ల కెపాసిటీ గల రెండు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (NPCIL) పిలిచిన టెండర్లలో MEIL అగ్రస్థానంలో నిలిచింది. రూ.12,800 కోట్ల ధరను కోట్ చేసి ఈ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు MEIL తెలిపింది.

Similar News

News November 29, 2025

క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

image

ఉత్తరాఖండ్‌ పిథోర్‌గఢ్‌లోని బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.

ఈ ఫైనాన్స్ జాబ్స్‌‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

image

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్‌లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.