News December 10, 2025
1,284 మంది బైండోవర్: ఎస్పీ నరసింహ

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని ఎస్పీ నరసింహ చెప్పారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, పాత నేరస్థులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నవారు 1,284 మందిని ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు. 136 కేసుల్లో రూ.9,50,000 విలువైన 1,425 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపాపారు. లైసెన్స్ కలగిన 53 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు.
Similar News
News December 10, 2025
విశాఖ: యువతితో సహజీవనం.. కుర్చీతో కొట్టి చంపిన వ్యక్తి అరెస్టు

పెందుర్తి పీఎస్ పరిధిలోని సుజాతనగర్లో యువతితో సహజీవనం చేస్తూ తగాదా పడి కుర్చీతో <<18498127>>కొట్టి చంపి పరారైన వ్యక్తిని<<>> పోలీసులు గాలించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు. శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ 6 నెలలుగా సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. డబ్బుల కోసం దేవీతో గొడవపడి చంపాడు. కాగా రైస్ పుల్లింగ్ వంటి పలు నేరాల్లో శ్రీనివాస్‌పై ఇప్పటికే కేసులున్నాయి.
News December 10, 2025
HYD: CM సాబ్.. జర దేఖోనా!

నేడు CM రేవంత్ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తావించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్‌లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
News December 10, 2025
HYD: CM సాబ్.. జర దేఖోనా!

నేడు CM రేవంత్ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్‌లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.


