News March 17, 2024
‘12th ఫెయిల్’ రియల్ హీరోకి ప్రమోషన్

12th ఫెయిల్ సినిమా స్టోరీకి కారణమైన రియల్ లైఫ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ ప్రమోషన్ పొందారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయనకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ నుంచి ఇన్స్పెక్టర్ జనరల్గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ASP నుంచి నా ఉద్యోగ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ఐజీ స్థాయికి ఎదిగా’ అని రాసుకొచ్చారు.
Similar News
News September 13, 2025
రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దు: పవన్ కళ్యాణ్

AP: తనపై దుష్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు Dy.CM పవన్ కళ్యాణ్ సూచించారు. ఘర్షణ పడడం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని పేర్కొన్నారు. ‘పదేళ్లుగా మనపై కుట్రలు చేస్తున్నవారిని చూస్తూనే ఉన్నాం. అలాంటివారి ఉచ్చులో పడొద్దు. ఎవరూ ఆవేశానికి గురై గొడవలకు దిగవద్దు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేవారిని చట్టం ముందు నిలబెట్టాలి’ అంటూ దిశానిర్దేశం చేశారు.
News September 13, 2025
రాజధానిపై సజ్జల కామెంట్స్ వైరల్.. మీరేమంటారు?

AP: తాము గెలిస్తే గుంటూరు-విజయవాడ మధ్య <<17688305>>రాజధాని<<>> ఏర్పాటు చేస్తామన్న సజ్జల వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నిసార్లు మాట మారుస్తారని TDP శ్రేణులు విమర్శిస్తున్నాయి. 2014లో జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారని, 2019లో గెలిచాక 3 రాజధానులు అన్నారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చారని, ఇది దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. మరి రాజధానిపై సజ్జల వ్యాఖ్యలపై మీ కామెంట్?
News September 13, 2025
రాత్రిళ్లు వాస్తు ఎందుకు చూడరంటే..

పాతకాలం పండితులు రాత్రి సమయంలో వాస్తు చూడరాదని చెప్పారు. ఎందుకంటే రాత్రి వేళల్లో ఉండే చీకటి వల్ల నిర్మాణంలోని సూక్ష్మమైన లోపాలు కనిపించకపోవచ్చు. కంటితో చూసే అంచనాలు తప్పు కావచ్చు. పరిసరాలలోని శక్తి ప్రవాహాన్ని, దిశలను సరిగ్గా అంచనా వేయడం కష్టం. దీనివల్ల వాస్తు దోషాలు కలిగే అవకాశం ఉంది. అందుకే వాస్తు శాస్త్ర నిపుణులు రాత్రిపూట వాస్తు చూడటాన్ని నిరాకరించారు.