News April 25, 2024
ఐజీగా ఛార్జ్ తీసుకున్న ‘12th ఫెయిల్’ రియల్ హీరో

12th ఫెయిల్ మూవీ స్టోరీకి కారణమైన రియల్ లైఫ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ ఐజీగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న ఆయన ‘కొత్త ఛార్జ్’ అంటూ బాధ్యతలు స్వీకరించిన ఫొటోలను ట్వీట్ చేశారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉన్న ఆయనకు ఇటీవలే ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉద్యోగోన్నతి లభించింది. 12వ తరగతిలో ఫెయిలైన మనోజ్ కుమార్ తర్వాత ఐపీఎస్ అయ్యి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Similar News
News December 1, 2025
‘దిత్వా’ తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ ఈ మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
News December 1, 2025
కిచెన్ టిప్స్.. మీ కోసం..

* సొరకాయ మిగిలిపోయినపుడు కుళ్లిపోకుండా ఉండాలంటే.. ఆ వైపును అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టాలి.
* గాజు గ్లాసులను తరలించేటప్పుడు వాటికి కాటన్ క్లాత్/ సాక్స్‌లు తొడిగితే ఒకదానికొకటి తగిలినా పగలవు.
* కేక్ మిశ్రమంలో టీ స్పూన్ గ్లిజరిన్ కలిపితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* వాటర్ బాటిల్‌ను వాడకుండా ఉంచితే దుర్వాసన వస్తుంది. ఇలా జరగకూడదంటే అందులో యాలకులు/లవంగాలు/ దాల్చిన చెక్క ముక్క వేసి ఉంచండి.
News December 1, 2025
రష్యాపై ఆంక్షలు.. 17,700 KMs నుంచి ఇండియాకు ఆయిల్

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో కరీబియన్ దేశం గయానా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. దాదాపు 17,700 కిలోమీటర్ల దూరం నుంచి ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయి. 2 సూపర్ ట్యాంకర్లు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించాయి. ఒక్కో దాంట్లో 2 మిలియన్ బ్యారెల్స్ చొప్పున ఆయిల్ వస్తోంది. జనవరి నాటికి అవి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది.


