News August 6, 2024
13న శ్రీహరికోటకు పవన్ కళ్యాణ్ రాక
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్సేస్ సెంటర్ షార్(శ్రీహరికోట)కు ఈ నెల 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇస్రో ఆధ్వర్యాన గత నెల 14 నుంచి ఈ నెల15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో ఈ కార్యక్రమాలు జరిపారు. షార్ వేదికగా ఈనెల 13న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హజరుకానున్నారు.
Similar News
News September 12, 2024
రేపే జొన్నవాడ ఆలయంలో టెండర్లు
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ సందర్భంగా అలంకరణ పనులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు టెండర్లలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
News September 12, 2024
నెల్లూరు: SP కారుకు ప్రమాదం
నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాకు చెందిన నాన్ క్యాడర్ ఎస్పీ కారుకు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా కళ్యాణీ డ్యాం వద్ద ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో నాన్ క్యాడర్ ఎస్పీగా సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారు. ఆయన కారు విజయవాడ నుంచి తిరుపతికి వస్తుండగా మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద హైవేపై లారీ ఢీకొట్టింది. కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎస్ఐ రాకేశ్ విచారణ చేస్తున్నారు.
News September 12, 2024
నెల్లూరు: కన్నతండ్రిని రాయితో కొట్టి చంపిన కొడుకు
సైదాపురం మండలం, మొలకలపూండ్ల అరుంధతివాడలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని ఓ కొడుకు రాయితో కొట్టి చంపిన ఘటన ఇవాళ జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. స్థానిక అరుంధతివాడలో కాపురముంటున్న పాలెపు. వెంకటేశ్వర్లుని తన కొడుకు శివాజీ కుటుంబ కక్షల నేపథ్యంలో రాయితో కొట్టి చంపాడు. ఈ ఘటనపై సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.