News May 12, 2024
13న సాయంత్రం 6 వరకు 144 సెక్షన్: ఎస్పీ

13వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు 48 గంటల పాటు 144 సెక్షను అమల్లో ఉంటుందని అనంతపురం ఎస్పీ బర్దర్ తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎన్నికల కమిషన్ డ్రైడే ప్రకటించడంతో శనివారం నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయించామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే డయల్ 100 లేదా జిల్లా పోలీసు ఎన్నికల విభాగం 93929 18293కు తెలియజేయాలన్నారు.
Similar News
News November 12, 2025
గుత్తిలో వ్యక్తి మృతి

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 12, 2025
శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎస్పీ

శాంత్రిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల ఛేదనకు టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.
News November 11, 2025
సిలిండర్ పేలి అనంతపురంలో వ్యక్తి మృతి

అనంతపురంలోని తపోవనంలో గ్యాస్ సిలిండర్ పేలి జిలాన్ బాషా (34) మృతిచెందారు. చిన్న సిలిండర్లో మోనో అమెనియం ఫాస్పేట్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.


